భారతదేశం, ఫిబ్రవరి 12 -- మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న గాంధీ సరోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి రావాలని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రితో సౌత్ బ్లాక్‌లోని కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి భేటీ అయ్యారు.

సుస్థిర ప‌ట్ట‌ణాభివృద్ధి ల‌క్ష్యాల‌తో ప‌ర్యావ‌ర‌ణ హితంగా, స్వ‌చ్ఛ‌మైన నీటితో న‌ది ప్ర‌వ‌హించేలా మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్టును చేప‌డుతున్న‌ట్లు కేంద్రమంత్రికి సీఎం రేవంత్ వివ‌రించారు. ఇందులో భాగంగానే ఈసా - మూసీ న‌దుల సంగ‌మ స్థ‌లిలో 1948లో జాతిపిత మ‌హ‌త్మా గాంధీ చిత‌భ‌స్మాన్ని నిమ‌జ్జ‌నం చేసిన బాపూ ఘాట్ వ‌ద్ద గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు చేప‌డుతున్న‌ట్లు తెలిపారు.

గాంధీజీ ఆశ‌యాలైన శాంతి, ఐక్య‌త‌, సుస్థిరాభివృద్ధి, నిరాడం...