భారతదేశం, ఫిబ్రవరి 22 -- టీ20 ప్రపంచకప్ లో ఆటతో అదరగొడుతున్న హార్దిక్ పాండ్య తన పర్సనల్ లైఫ్ పరంగానూ వార్తల్లో నిలుస్తున్నాడు. రీసెంట్ గా తన గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే సందర్భంగా రొమాంటిక్ ఫొటో, వీడియోను అతను షేర్ చేశాడు. ఇప్పుడు తన కొడుకు అగస్త్యకు ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చాడు. హార్దిక్ మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ తన కొడుకు పక్కనే ఉండి కారు డెలివరీ తీసుకుంది.

హార్దిక్ పాండ్య, నటాషా స్టాంకోవిచ్ భార్యాభర్తలుగా విడిపోయినా తమ కొడుకు అగస్త్యను ఇద్దరూ కలిసి పెంచుకుంటున్నారు. తమ కొడుకు పట్ల వారికి ఎంత ప్రేమ ఉందో ప్రపంచానికి చాటిచెప్పేలా ఇద్దరూ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూనే ఉన్నారు. తాజాగా తన కొడుకు కోసం ఖరీదైన ల్యాండ్ రోవర్ కారును హార్దిక్ గిఫ్ట్ గా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

టీమిండియా ఆల్ రౌం...