భారతదేశం, సెప్టెంబర్ 30 -- ఛత్తీస్​గఢ్​లో జరిగిన ఒక షాకింగ్​ ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రాయ్‌పూర్ నగరంలోని గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక లాడ్జిలో ఓ యువకుడి మృతదేహాన్ని పోలీసులు ఆదివారం కనుగొన్నారు. ఈ దారుణ హత్యను అతడి 16 ఏళ్ల ప్రియురాలు చేసినట్లు తెలిసింది. హత్య అనంతరం ఇంటికి తిరిగి వెళ్లిన ఆ బాలిక, జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పంది. అప్పుడే ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలాస్‌పూర్‌లోని కోనీ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఆ బాలిక, తన ప్రియుడు మహ్మద్ సద్దాంను కలవడానికి సెప్టెంబర్ 28న రాయ్‌పూర్​కి వెళ్లింది. బిహార్‌కు చెందిన సద్దాం, అభన్‌పూర్‌లో ఎంఎస్ ఇంజినీరింగ్ అధికారిగా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ రాయ్‌పూర్‌లోని రామన్ మందిర్ వార్డు, సత్కార్ గల్లీలో ఉన్న అవోన్ లాడ్జిలో శనివారం నుంచి కలిసి ఉంట...