భారతదేశం, డిసెంబర్ 15 -- ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సినిమా పేరు దురంధర్. ర‌ణ్‌వీర్‌ సింగ్ హీరోగా వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అదరగొడుతోంది. ఈ హిందీ సినిమా కొత్త కలెక్షన్ల రికార్డులు నమోదు చేస్తోంది. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది.

దురంధర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ర‌ణ్‌వీర్‌ సింగ్ తో పాటు ఇతర కీలక నటుల యాక్టింగ్ కు సెల్యూట్ కొడుతున్నారు. సెలబ్రిటీలు కూడా ఈ మూవీపై మనసు పారేసుకుంటున్నారు. ఇక కలెక్షన్ల మోత మోగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారని టాక్.

హిందీలో రిలీజైన సినిమా...