భారతదేశం, జనవరి 19 -- సౌత్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయికలుగా పేరుగాంచిన నయనతార (Nayanthara), త్రిష (Trisha) తమ అభిమానులకు సోమవారం (జనవరి 19) ఒక బ్యూటిఫుల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. వీరిద్దరూ కలిసి సముద్రం మధ్యలో క్రూజ్ షిప్‌పై ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వెనుక సూర్యాస్తమయం, చల్లని సముద్రపు గాలి మధ్య.. నలుపు రంగు దుస్తులు, కూలింగ్ గ్లాసెస్ ధరించి వీరిద్దరూ నవ్వుతూ దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇద్దరు టాప్ హీరోయిన్లు అయిన నయనతార, త్రిష ఇలా కలిసి కనిపించడం చాలా అరుదు కావడంతో.. కొందరు ఇది నిజమా లేక ఏఐ (AI) క్రియేషనా అని అనుమానం వ్యక్తం చేశారు. "నయన్ అకౌంట్ చూశాకే ఇది నిజమని తెలిసింది" అని ఒకరు.. "ఫైనల్లీ.. త్రిష లేకపోతే నయనతార నిజమైంది" అని మరొకరు కామెం...