భారతదేశం, నవంబర్ 22 -- భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య గువాహటిలోని బర్సపారా స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌ ఒక అరుదైన ఘట్టాన్ని ఆవిష్కరించనుంది! సాధారణంగా టెస్ట్​ మ్యాచ్​లో ముందు లంచ్​ బ్రేక్​ తీసుకుంటారు. ఆ తర్వాత టీ బ్రేక్​ వస్తుంది. కానీ ఈ మ్యాచ్‌లో లంచ్ బ్రేక్‌ కంటే ముందే టీ బ్రేక్ తీసుకుంటారు! దీనికి కారణం ఏంటి?

గువాహటి వేదికపై జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌తో గువాహటి దేశంలో 30వ టెస్ట్ వేదికగా నిలిచింది. కానీ నిర్వాహకులకు బ్యాట్-బాల్ కంటే కూడా సూర్యుడితో పోరాడటమే పెద్ద సవాలుగా మారింది!

భారతదేశంలో సాధారణంగా టెస్ట్ మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే, గువాహటిలో తొలిసారిగా ఈ సంప్రదాయం బ్రేక్ అయింది! ఈ మ్యాచ్ ఉదయం 9 గంటలకే ప్రారంభమైంది.

గతంలో వర్షం కారణంగా ఓవర్లు కోల్పోయినప్పుడు కొన్నిసా...