భారతదేశం, మే 31 -- భారతదేశంలో 3,395 యాక్టివ్ కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో గత 24 గంటల్లో నమోదైన కొరోనా కేసుల సంఖ్య 685 అని తెలిపింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ లో 17, తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా కొరోనాతో శుక్రవారం ఒక్కరోజే 4 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు 26 మంది కరోనాతో మృతి చెందారు. వారిలో మహారాష్ట్రలో ఏడుగురు, కేరళలో ఆరుగురు, ఢిల్లీ ముగ్గురు, కర్నాటకలో ముగ్గురు, యూపీలో ఇద్దరు ఉన్నారు. కాగా, గత 24 గంటల్లో కోవిడ్ 19 కారణంగా దేశంలో 4మరణాలు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళలో ఒక్కొక్కరు మరణించారు.
కేరళ, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.