భారతదేశం, జూలై 31 -- దేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ కోల్ ఇండియాకు షాక్ తగిలింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ నికర లాభం ఏకంగా 20 శాతం మేర తగ్గింది. గతేడాది ఇదే సమయంలో రూ. 10,943 కోట్లుగా ఉన్న లాభం, ఈసారి రూ. 8,734 కోట్లకు పడిపోయింది. అయితే, శుభవార్త ఏమిటంటే, ఈ త్రైమాసిక ఫలితాలతో పాటే షేరుకు రూ. 5.50 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.

కోల్ ఇండియా వెల్లడించిన కన్సాలిడేటెడ్ ఆర్థిక నివేదికల ప్రకారం, సంస్థ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కోర్ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 4.4 శాతం తగ్గి రూ. 35,842 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 37,504 కోట్లుగా ఉండేది.

ఆదాయం తగ్గడమే కాకుండా, సంస్థ మొ...