భారతదేశం, జనవరి 8 -- కొత్త ఏడాదిలో కారు సొంతం చేసుకోవాలనుకునే వారికి ఫ్రెంచ్ కార్ల దిగ్గజం రెనాల్ట్ (Renault) బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన పాపులర్ మోడళ్లయిన క్విడ్, కైగర్, ట్రైబర్‌లపై ఈ జనవరిలో భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. వేరియంట్‌ను బట్టి ఈ తగ్గింపు గరిష్టంగా రూ. 88,500 వరకు ఉండటం విశేషం.

రెనాల్ట్ అందిస్తున్న ఈ ఆఫర్లలో నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆ వివరాలు కింద చూడండి:

రెనో పోర్ట్‌ఫోలియోలో అత్యధిక డిస్కౌంట్ ఈ స్టైలిష్ ఎస్‌యూవీపైనే ఉంది.

నగదు తగ్గింపు: వేరియంట్‌ను బట్టి రూ. 38,500 వరకు.

ఎక్స్ఛేంజ్ బోనస్: రూ. 15,000.

లాయల్టీ బోనస్: రూ. 10,000.

స్క్రాపేజ్ బోనస్ (RELIVE): రూ. 25,000.

ప్రత్యేకత: ఇది 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్, టర్బో ఛార్జ్డ్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంద...