భారతదేశం, ఫిబ్రవరి 23 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. ఒకానొక సందర్భంలో ఈ స్టాక్​ బీఎస్​ఈలో 20శాతం లోయర్​ సర్క్యూట్​ని సైతం హిట్​ చేసింది. చండీగఢ్‌లోని ఒక బ్రాంచ్‌లో సుమారు రూ. 590 కోట్ల విలువైన మోసపూరిత లావాదేవీలను గుర్తించినట్లు బ్యాంకు చేసిన ప్రకటన తర్వాత ఈ అమ్మకాల ఒత్తిడి మొదలైంది. ఉదయం మార్కెట్ ప్రారంభంలోనే 10శాతం నష్టంతో మొదలైన షేరు, ఆ తర్వాత ఏమాత్రం కోలుకోకుండా రోజువారీ కనిష్ట స్థాయి రూ. 66.80కి పడిపోయింది.

అనంతరం ఉదయం 10 గంటల 20 నిమిషాల సమయంలో ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ షేరు ధర 16.6శాతం నష్టాలతో రూ. 69.6 వద్ద ట్రేడ్​ అవుతోంది.

బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం, హరియాణా ప్రభుత్వానికి చెందిన ఒక విభాగం తమ ఖాతాను మూసివేసి నిధులను మరో బ్యాంకుకు బదిలీ చేయాలని కోరినప్పుడు ఈ మోసం వెలుగులోక...