భారతదేశం, నవంబర్ 30 -- జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న చిన్న దుకాణాల్లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగనప్పటికీ. ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న వెంటనే 3 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు.ఆలయ దిగువన ఉన్న శ్రీనాథ్ రెసిడెన్సీ సముదాయంలోని దాదాపు 20 దుకాణాల్లో ప్లాస్టిక్, ఆట బొమ్మలకు మంటలు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
షార్ట్ సర్క్కూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.