Telangana,andhrapradesh, జూలై 27 -- బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇదే విషయాన్ని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చెప్పారు. కేటీఆర్ చేసిన కొన్ని ఆరోపణలపై స్పందించిన సీఎం రమేశ్.. కేటీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అంతేకాకుండా గతంలో బీఆర్ఎస్ విలీనం కోసం తన వద్దకు రాలేదా అని కూడా ప్రశ్నించారు. సీసీ పుటేజీలను కూడా బయటపెడతానంటూ మాట్లాడారు. సీఎం రమేశ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.

బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీమనమయ్యే ప్రసక్తే ఉండదని కేటీఆర్ స్పష్టం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే ఇదంతా అంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే ఇవాళ కూడా సీఎం రమేశ్ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇద్దరు నేతల మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరినట్లు అయింది.

హెచ్ సీయూ భూములతో పాటు ఫ్యూచర్ సిటీలో సీఎం రమేశ్ కు అక్రమంగా కాంట్రాక్ట్ కట్టబెట్టారని కేటీఆర్...