భారతదేశం, డిసెంబర్ 24 -- కెనడాలో నివసిస్తున్న భారతీయులను మరో విషాద వార్త కలిచివేసింది. టొరంటోలో ఉంటున్న 30 ఏళ్ల భారతీయ మహిళ హిమాన్షీ ఖురానా దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 32 ఏళ్ల అబ్దుల్ గఫూరీ అనే వ్యక్తిపై 'ఫస్ట్ డిగ్రీ మర్డర్' కింద కేసు నమోదు చేశారు. హిమాన్షీకి గఫూరీ సన్నిహితుడు అని తెలుస్తోంది.

ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

టొరంటో పోలీస్ సర్వీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 19వ తేదీ రాత్రి స్ట్రాచన్ అవెన్యూ, వెల్లింగ్టన్ స్ట్రీట్ వెస్ట్ ప్రాంతంలో ఒక మహిళ అదృశ్యమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు, శనివారం (డిసెంబర్ 20) ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఒక నివాసం లోపలికి వెళ్లారు. అదృశ్యమైన మహిళ మృతదేహాన్ని అందులో గుర్తించారు. ఆమెను హిమాన్షీ ఖురానాగా నిర...