భారతదేశం, ఏప్రిల్ 29 -- కెనడాలో మరో భారత విద్యార్థిని మరణం కలకలం సృష్టించింది. ఒట్టావా ప్రావిన్స్​లో అదృశ్యమైన వంశికా సైనీ మృతదేహం లభ్యమైనట్లు కెనడాలోని భారత హైకమిషన్ వెల్లడించింది. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.

హరియాణాలో 12వ తరగతి పూర్తి చేసిన వంశిక, ఆ తర్వాత కెనడాకు వెళ్లింది. అక్కడ రెండేళ్ల హెల్త్​ డిప్లొమా కోర్సు చేసింది. కాగా ఏప్రిల్​ 18న ఫైనల్​ పరీక్షలు పూర్తవ్వడంతో ఒట్టావాలోని ఒక కాల్​ సెంటర్​లో పార్ట్​-టైమ్​లో చేరింది. ఏప్రిల్​ 22న ఉద్యోగం కోసం బయలుదేరిన ఆమె, తిరిగి ఇంటికి వెళ్లలేదు!

ఆమె మృతదేహం బీచ్​లో కనిపించిందని అధికారులు చెప్పారు.

"ఒట్టావాలో భారతదేశానికి చెందిన వంశిక సైని అనే విద్యార్థిని మరణించినట్లు తెలియగానే మేము చాలా బ...