భారతదేశం, జూన్ 9 -- కెనడా తన ఇమ్మిగ్రేషన్ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్న సమయంలో ప్రధానమంత్రి మార్క్ కార్నీ నేతృత్వంలోని ప్రభుత్వం తాజాగా ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ఈ సీ-3 బిల్లు.. సంతతి అందించే పౌరసత్వంపై పరిమితిని తొలగిస్తుంది. ఈ మేరకు కొత్త బిల్లును ఆ దేశ ఇమ్మిగ్రేషన్​ మినిస్టర్​ లీనా మెట్లెజ్​ డయాబ్​ పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు. ఈ కొత్త బిల్లును భారతీయ సమాజం సహ అనేక మంది వలసదారులు స్వాగతిస్తున్నారు.

ప్రస్తుత రూల్స్​ ప్రకారం.. కెనడా వెలుపల పుట్టిన ఆ దేశ పౌరుడు.. తమ సంతతికి, సిటిజెన్​షిప్​ని ఇవ్వలేడు. 2009లో ప్రవేశపెట్టిన ఈ నియమం పౌరసత్వాన్ని మొదటి తరానికే పరిమితం చేసింది. తాజా ప్రతిపాదిత బిల్లు దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తోంది.

కానీ ఇలా జరగాలంటే తల్లిదండ్రులు కెనడాతో సంబంధాన్ని ధ్రువీకరించుకోవాలి. అంటే, బిడ్డ పుట్...