భారతదేశం, జనవరి 30 -- ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఇటీవల బాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో మారుతున్న పరిస్థితులు, పవర్ పాలిటిక్స్ గురించి చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. క్రియేటివిటీ లేని వ్యక్తుల చేతిలోకి అధికారం వెళ్లిందని, ఇది "మతపరమైన విషయం" కూడా కావచ్చని అతడు అభిప్రాయపడ్డాడు. అయితే ప్రముఖ నటి రాణి ముఖర్జీ ఈ వ్యాఖ్యలను తప్పుబట్టింది.
డీడీ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ మాట్లాడుతూ.. ఏఆర్ రెహమాన్ కామెంట్స్ ను ఖండించింది. "బాలీవుడ్ చాలా సెక్యులర్ ప్రదేశం అని నేను బలంగా నమ్ముతాను. ఇక్కడ కులం లేదా మతం ఆధారంగా ఎలాంటి వివక్ష ఉండదు. ఈ పరిశ్రమలో నా 30 ఏళ్ల ప్రయాణంలో నేను ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు. నేను ఈ ఇండస్ట్రీని ప్రేమిస్తున్నాను. అది నన్ను ఈ స్థాయికి చేర్చింది. నా గుండె లోతుల్లో నుంచి చెబుతున్నాను.. ఇక్కడ కేవలం ప్రతిభ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.