భారతదేశం, ఫిబ్రవరి 18 -- మాజీ మిస్ ఇండియా మానస వారణాసి కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. అందంతో పాటు అభినయంతోనూ ఫ్యాన్స్ ను మెప్పిస్తోంది. మరోవైపు మాటల్లోనూ చురుకే అని నిరూపించుకుంది. తాజాగా కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు మానస ఆన్సర్ తెగ వైరల్ గా మారింది.

కపుల్ ఫ్రెండ్లీ మూవీలో సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో మానసకు ఓ ప్రశ్న ఎదురైంది. ''ఈ సినిమాలో కిస్ సీన్లు ఉన్నాయి కదా. అసలు కిస్ అంటే ఏంటీ? కాస్త వివరించండి'' అని ఓ రిపోర్టర్ ప్రశ్న అడిగాడు. కిస్ అంటే సాధారణంగా ఏమని వివరిస్తామనే అంతా ఆలోచిస్తారు. కానీ మానస మాత్రం వెంటనే కౌంటర్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు మానస వారణాసి ఇచ్చి...