Hyderabad, సెప్టెంబర్ 11 -- తెలుగులో హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కిష్కింధపురి. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రాక్షసుడు సినిమా తర్వాత మరోసారి జంటగా నటించిన మూవీ కిష్కింధపురి. ఈ సినిమాకు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు.

షైన్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సాహు గారపాటి కిష్కింధపురి చిత్రాన్ని నిర్మించారు. అయితే, హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన కిష్కింధపురి సినిమా ట్రైలర్కు మంచి స్పందన లభించింది. భైరవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై బెల్లం కొండ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.

ఇక సెప్టెంబర్ 12న అంటే రేపు కిష్కింధపురి సినిమాను వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు బెల్లం బాబు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి (సెప్టెంబర్ 10) హైదరాబాద్...