భారతదేశం, ఫిబ్రవరి 12 -- టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు తన రూట్ మార్చారు. 'క' (KA) సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ మూవీతో మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు నేరుగా బాలీవుడ్ మేకర్స్‌తో చేతులు కలిపి ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు.

భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, పురాణ గాథల నేపథ్యంలో సాగే ఈ చిత్రం కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్, బాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా (Ess Kay Gee Entertainment)తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్, భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్‌గా అద...