భారతదేశం, మే 15 -- దక్షిణ కాశీగా పేరుగాంచిన భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమంలో ప్రారంభమైన సరస్వతీ పుష్కరాలకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
దేశ నలుమూలల నుంచి సరస్వతీ పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానుండగా, పటిష్ట బందోబస్తు నిర్వహించేందుకు పోలీస్ అధికారులు రెడీ అయ్యారు. తెలంగాణ పోలీసులతో పాటు ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర కు సంబంధించిన పోలీసులకు కూడా ఇక్కడ విధులు కేటాయించారు. ఇప్పటికే భద్రతా పరమైన ఏర్పాట్లను భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
సరస్వతీ నదీ పుష్కరాలు 15వ తేదీ గురువారం నుంచి 26వ తేదీ వరకు జరగనుండగా, దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ప్రతి రోజు కనీసం లక్ష మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.