భారతదేశం, నవంబర్ 5 -- యూఎస్‌లోని అనేక రాష్ట్రాలతో పాటు, కాలిఫోర్నియాలో కూడా ఈ రోజు (మంగళవారం) ప్రత్యేక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా 2026 మధ్యంతర ఎన్నికలకు ముందు గవర్నర్ గావిన్ న్యూసోమ్ ఆమోదించిన కాంగ్రెస్ నియోజకవర్గాల పునర్విభజన ప్రణాళిక అయిన ప్రొపోజిషన్ 50పై ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

మంగళవారం రోజున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇంకొన్ని గంటల్లో పోలింగ్ ముగియనుంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల కల్లా ఓటర్లు తమ సమీపంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేయవచ్చు.

కాలిఫోర్నియాలో పోలింగ్ కేంద్రాలు మంగళవారం ఉదయం 7 గంటలకు తెరుచుకున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. అయితే, 8 గంటల లోపు ఓటు వేయడానికి క్యూలో నిలబడిన వారికి మాత్రం ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.

ఓటర్లు తమ బ్యాలెట్‌లను పోల...