భారతదేశం, అక్టోబర్ 8 -- అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇకపై దీపావళి పండుగను అధికారిక రాష్ట్ర సెలవుదినంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ బిల్లుపై సంతకం చేశారు. ఈ నిర్ణయం 2026 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.

దీంతో, దీపావళిని రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించిన మూడవ US రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. గతంలో పెన్సిల్వేనియా, కనెక్టికట్ రాష్ట్రాలు ఈ పండుగకు అధికారిక గుర్తింపు ఇచ్చాయి. వెస్ట్ కోస్ట్‌లో ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రం కాలిఫోర్నియా కావడం విశేషం.

గవర్నర్ న్యూసమ్ సంతకం చేసిన ఈ కొత్త చట్టం (Assembly Bill 268) వల్ల.. దీపావళి రోజున ప్రజలకు ఎంతో సౌలభ్యం కలగనుంది. పబ్లిక్ స్కూళ్లు, కమ్యూనిటీ కళాశాలలు దీపావళి రోజున మూసివేయడానికి ఈ చట్టం అధికారం ఇస్తుంది.

ర...