భారతదేశం, ఫిబ్రవరి 7 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కూతురు స్వప్నతో శ్రీధర్ చేయి పట్టుకుని మాట్లాడుతాడు. కాశీ గురించి అయితే వద్దంటుంది స్వప్న. కాశీ ఎవరు. నేను నా కూతురు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దానికి ముందు మెడలో తాళి తీసి పక్కన పెట్టు అని శ్రీధర్ అంటాడు.

దాంతో స్వప్న, కావేరి ఇద్దరు షాక్ అవుతారు. మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని కావేరి అంటుంది. నా కూతురు గురించి. కాశీని వద్దంటే పెళ్లి చేసుకోడానికి ఆగిందా, ఇప్పుడు కలవమంటే వింటుందా. నువ్వు ఎవరి కోసం తగ్గొద్దు. తాళి తీసి పక్కన పెట్టు. భర్తనే వద్దనుకున్నప్పుడు తాళి ఎందుకమ్మా. భర్తే బారంగా మారినప్పుడు తాళి ఎందుకు. నీకు అన్ని తెలుసు. నీకు జీవితం గురించి చెప్పాలా అని శ్రీధర్ అంటాడు.

విడిపోతానంటున్నావ్. విడాకులు కావాలంటున్నావ్ కదా. ఇలాంటి వాటికి సొసైటీ బాగా సపోర్ట్ చే...