భారతదేశం, ఫిబ్రవరి 21 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో నువ్వు నన్ను నమ్మిన నమ్మకపోయిన నేనే నీ మనవరాలిని అని తెలుస్తుంది. కానీ, ఆలోపు కథ ముగుసిపోతుంది. దాని నుంచి మనం బయటపడాలంటే దాసు బావను కలవకూడదు. కార్తీక్ బావ ఎక్కడ ఉన్నాలో తెలుసుకోవాలి అని జ్యోత్స్న అంటుంది.

దాంతో కాంచనకు కాల్ చేసి దీప, కార్తీక్ ఇంకా రాలేదు. ఏమైనా ఆరోగ్య సమస్య అని ఆరాలు తీస్తుంది పారిజాతం. కార్తీక్ దీప గుడికి వెళ్లారని చెప్పి కాల్ కట్ చేస్తుంది కాంచన. అదే విషయం జ్యోకి చెప్పిన పారిజాతం దాసును కలవడానికి గుడికి వెళ్లారంటావా.. ఇంట్లో ఇంకో మనిషి కూడా కనిపించట్లేదు. అతను కూడా గుడికి వెళ్లాడా మీ నాన్న దశరథ అని పారు అంటుంది.

దాంతో జ్యో ఊయల కుప్పకూలి కూర్చొంటుంది. తెగ వణికిపోతుంటుంది జ్యోత్స్న. నువ్వు చెప్పిన ఆట ఇది కాదు కదా అని పారిజాతం అంటుంది. మరోవైపు దశరథ ఆవేశంగ...