భారతదేశం, ఫిబ్రవరి 11 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 11 ఎపిసోడ్ లో.. శ్రీధర్, కావేరి, స్వప్న గుడికి వెళ్లేందుకు రెడీ అవుతారు. కారుకు డ్రైవర్ ను పెట్టుకున్నా. ఇంటి పనుల్లోనూ సాయం చేస్తాడని కూడా శ్రీధర్ చెప్తాడు. డ్రైవర్ గా కాశీ ఎంట్రీ ఇస్తాడు. అల్లుడు డ్రైవర్ ఏంటి అని కావేరి అడుగుతుంది. డ్రైవర్ గా పెట్టుకున్న వ్యక్తే అల్లుడు అయ్యాడని శ్రీధర్ చెప్తాడు.

నాకు అంతా అర్థమవుతుంది నాన్న అని స్వప్న కారు దిగుతుంది. ఇంట్లో ఇంత గొడవ జరిగినా మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని అనుకున్నా. కానీ దీని వెనుక ఇంత డ్రామా ఉందని అనుకోలేదు. మీరు కాశీని తీసుకొచ్చింది డ్రైవర్ గా కాదు. కూతురితో కలపడానికి అని శ్రీధర్ ను స్వప్న అడుగుతుంది. ఈ రోజు నుంచి కాశీ మన డ్రైవర్. మనతోనే ఉంటాడు, మనతోనే తింటాడు. మన పనులన్నీ చేస్తాడు. నెలకు రూ.25 వేల జీతం అని శ్రీధర్ చెప్తా...