భారతదేశం, ఫిబ్రవరి 21 -- బుల్లితెరపై సంచలనం సృష్టించిన 'కార్తీకదీపం' సీరియల్, తన రెండో సీజన్ 'కార్తీకదీపం: ఇది నవ వసంతం' ద్వారా మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ సీరియల్ ఈ శనివారం (ఫిబ్రవరి 21, 2026)తో విజయవంతంగా 600 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని స్టార్ మా తన ఎక్స్ అకౌంట్ ద్వారా రివీల్ చేసింది. ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ రాత్రి 8 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోంది. జియోహాట్‌స్టార్ లోనూ చూడొచ్చు.

కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం రెండో సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇది కూడా 600 ఎపిసోడ్ల మైలురాయిని అందుకుంది. స్టార్ మా ఛానెల్ ఈ విషయాన్ని ఎక్స్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేస్తూ.. "మన మనసుల్లో చెరగని ముద్ర వేసిన కార్తీకదీపం 600 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు" అనే క...