భారతదేశం, అక్టోబర్ 27 -- కార్తిక మాసం ప్రారంభమైంది. ప్రత్యేకమైన కార్తిక సోమవారం కావడంతో భక్తులు ఆలయాలకు వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. కార్తిక మాసం ముదటి సోమవారం కావడంతో పంచాక్షరి మంత్రంతో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి. ఆలయాలు కార్తిక శోభను సంతరించుకున్నాయి. కార్తిక మాసం తొలి సోమవారం కావడంతో మహా శివుడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయమే శివయ్యను దర్శించుకుని.. ఆలయాల్లో కార్తిక దీపాలను వెలగించారు.

తెల్లవారుజామున నుంచే ఆలయాల వద్ద భక్తుల సందడి కనిపించింది. పవిత్ర దినమైన కార్తిక సోమవారం నాడు భక్తులు గంగా స్నానం చేసి.. భక్తి భావంతో శివాలయాలను దర్శించుకున్నారు. ఏపీలోని శ్రీశైలం, కాళహస్తితోపాటుగా ఇతర శివాలయాలు శివయ్య నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శైవక్షేత్రాలు కార్తిక శోభను సంతరించుకున్నాయి. ఓం నమ: ...