భారతదేశం, ఫిబ్రవరి 24 -- బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ చుట్టూ ఇప్పుడు చట్టపరమైన చిక్కులు ముసురుకున్నాయి. కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ 'కాంతార' (Kantara) సినిమాలోని కొన్ని సన్నివేశాలను, ముఖ్యంగా దైవానికి సంబంధించిన హావభావాలను అనుకరించడం (Mimicry) ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టింది.

తనపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)ను సవాలు చేస్తూ రణ్‌వీర్ సింగ్ ఇటీవల కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం (ఫిబ్రవరి 23) విచారణకు వచ్చిన ఈ పిటిషన్‌ను కోర్టు ఇవాళ్టీకి (ఫిబ్రవరి 24) వాయిదా వేసింది.

న్యాయమూర్తి జస్టిస్ ఎం. నాగప్రసన్న ధర్మాసనం ముందు రణ్‌వీర్ సింగ్ తరపు న్యాయవాది ఈ కేసును అత్యవసరంగా విచారించాలని కోరారు. "పిటిషనర్ ఒక బాలీవుడ్ నటుడు. 'కాంతార: చాప్టర్ 1'పై ఆయన వ్యక్తం చేసిన నిజాయితీ గల ప్రశంసలకు క్రిమినల్ రంగు పులుముతున్నారు" అని న్యాయవాది వాదించారు.

ఈ రోజు...