భారతదేశం, ఏప్రిల్ 22 -- జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ లో జరిగిన ఉగ్రదాడిలో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. టెర్రరిస్ట్ ల కాల్పుల్లో గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ లోయలో కాల్పుల శబ్దం వినిపించడంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రదేశాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటలిజెన్స్ ప్రాథమిక నివేదికలు హెచ్చరించాయి. కాల్పుల ఘటన అనంతరం ఈ ప్రాంతానికి అదనపు భద్రతా బలగాలను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు.
గుర్తుతెలియని దుండగులు పర్యాటకులపై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారని, దీంతో మృతుల సంఖ్య భారీగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడిలో తన భర్త తలపై కాల్పులు జరిగాయని, మరో ఏడుగురికి గాయాలయ్యాయని ఒక బాధితురాలు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.