భారతదేశం, ఫిబ్రవరి 9 -- ముంబై: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్లు మార్కెట్లో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సోమవారం (ఫిబ్రవరి 9) ఉదయం ట్రేడింగ్‌లో కంపెనీ షేరు ధర దాదాపు 12 శాతం పెరిగి రూ. 424.85 వద్దకు చేరింది. గత ముగింపు ధర రూ. 379.80తో పోలిస్తే ఇది భారీ జంప్. గత ఏడాది కాలంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఈ స్టాక్, తాజా ఫలితాల జోరుతో మళ్లీ కోలుకుంటోంది.

శుక్రవారం సాయంత్రం కంపెనీ ప్రకటించిన ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించిపోయాయి.

పండుగ సీజన్ కావడంతో భారత్‌లో బంగారం విక్రయాలు జోరుగా సాగాయి. ముఖ్యంగా దక్షిణాదియేతర మార్కెట్లలో (Non-South) కంపెనీ తన పట్టును పెంచుకోవడం కలిసొచ్చింది. అలాగే, భారత్-అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం (Interim Trade Agreement) ఆభరణాల ఎగుమతులకు కొత్త జవజీవాలు పోసింది. అమెరికా భారత్‌కు అతిప...