ఆంధ్రప్రదేశ్​ కర్నూల్​ జిల్లాలోని హైదరాబాద్​, Oct. 24 -- బెంగళూరు హైవేపై విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్​ నుంచి బెంగళూరుకు వెళుతున్న ఓ ప్రైవేట్​ బస్సులో మంటలు చేరగాయి. కొద్ది క్షణాల్లోనే బస్సు అగ్నికి ఆహుతైపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42మంది ఉన్నారని సమాచారం. ఈ ఘటనలో 20మంది మరణించినట్టు, అనేక మందికి గాయాలైనట్టు తెలుస్తోంది.

కర్నూల్​ జిల్లాలో బస్సు ప్రమాదం- అసలేం జరిగింది? ఆంధ్రప్రదేశ్​ కర్నూల్​ జిల్లాలోని చిన్నటేకూరు గ్రామానికి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగింది. తొలుత బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం బస్సులో మంటలు చెలరేగాయి.

“తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కావేరీ ట్రావెల్స్​కి చెందిన ఏసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఆ 2 వీలర్​ బస్సు కింద చిక్కుకుపోయింది. దాని వల్లే మంటలు చెలరేగి ...