భారతదేశం, మే 24 -- రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... కడపలో జరగనున్న మహానాడు సభను వాయిదా వేసేందుకు చర్యలు తీసుకోవాలని వైసీపీ కోరుతున్నారు. ఈ మేరకు వైసీపీ నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా ఇవాళ కడప కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున జరిగే సభలు, సమావేశాలు ఈ పరిస్థితుల్లో ప్రజలకు ప్రమాదకరమవుతాయని వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ మహానాడు సందర్భంగా కరోనా వ్యాపించే అవకాశం ఉన్నందున వాయిదా వేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు.
అయితే ఈసారి చరిత్రలో నిలిచిపోయే మహానాడు నిర్వహిస్తామని టీడీపీ చెబుతోంది. ఈ మేరకు నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.