భారతదేశం, నవంబర్ 12 -- తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా..? బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ ప్లాన్ చేసుకునే వారి కోసం ఐఆర్సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. 'తిరుపతి ఫ్రమ్ కరీంనగర్' పేరుతో ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్‌లో తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలను చూడొచ్చు.

ఈ ప్యాకేజీ ప్రస్తుతం 20 నవంబర్, 2025వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ డేట్ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ (https://www.irctctourism.com/ ) లో చూడొచ్చు.

జర్నీ కోసం టికెట్లు ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. అయితే కేవలం కరీంనగర్ మాత్రమే కాకుండా. వరంగల్, ఖమ్మం రైల్వే స్టేషన్ లో కూడా ప్రయాణికులు ట్రైన్ ఎక్కొచ్చు.

కరీంనగర్ - తిరుమల టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే... సింగిల్ షేరింగ్ కు రూ. 14,030 ధర ఉండగా.. ...