భారతదేశం, మే 16 -- వరంగల్ నగరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవన నిర్మాణానికి మంత్రి కొండా సురేఖ గురువారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నోరు జారారు. 'అటవీ శాఖ మంత్రిగా ఉండటం వల్ల కొన్ని కంపెనీలు ఫైళ్ల క్లియరెన్స్ కోసం నా వద్దకు వస్తాయి. సాధారణంగా ఫైళ్లను క్లియర్ చేయడానికి మంత్రులు డబ్బులు తీసుకుంటారు. కానీ నేను మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వవద్దని, దానికి బదులు పాఠశాలలు నిర్మించి, సమాజ సేవ చేయాలని వారికి చెబుతున్నాను' అంటూ చెప్పుకొచ్చారు. ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు పైసలు తీసుకుంటారంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దానిని కాంగ్రెస్ మంత్రులకకు ఆపాదించి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో తీవ్ర దుమారం చెలరేగింది.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణం కాగా.. ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.