భారతదేశం, ఆగస్టు 6 -- విద్యార్థుల అటెండెన్స్​ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) కీలక ప్రకటన చేసింది. 2026లో జరగబోయే 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరవ్వడానికి విద్యార్థులకు కనీసం 75 శాతం అటెండెన్స్​ తప్పనిసరి అని స్పష్టం చేసింది.

అయితే.. వైద్య అత్యవసర పరిస్థితులు, జాతీయ లేదా అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇతర తీవ్రమైన కారణాల వల్ల అటెండెన్స్​ తక్కువగా ఉంటే, మరో 25 శాతం వరకు మినహాయింపు ఇస్తామని సీబీఎస్‌ఈ తెలిపింది. కానీ ఇలాంటి సందర్భాల్లో విద్యార్థులు తగిన పత్రాలను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుందని వివరించింది.

తప్పనిసరి హాజరుపై సమాచారం: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు 75 శాతం హాజరు నిబంధన గురించి, దాన్ని పాటించకపోతే ఎదురయ్యే పరిణామాల గురించి స్పష్టంగా తెలియజేయాలి. వైద్యపరమైన లేదా ఇతర కారణాల వల్ల స...