భారతదేశం, డిసెంబర్ 4 -- ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ మాదిరిగానే ఫైబర్ కూడా మన రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగం. అయితే, కొంతమందికి ఫైబర్ తీసుకుంటే కడుపు ఉబ్బరం (Bloating) సమస్య వస్తుంది. ముఖ్యంగా ఫైబర్ తీసుకోవడం వేగంగా పెంచినప్పుడు లేదా తగినంత నీరు తాగనప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.

యూకేకు చెందిన సర్జన్, హెల్త్ కంటెంట్ క్రియేటర్ అయిన డాక్టర్ కరణ్ రాజన్ ఈ సమస్యకు పరిష్కారం ఉందని చెబుతున్నారు. అదేంటంటే, కడుపు ఉబ్బరం కలిగించని ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం. నవంబర్ 27న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, సున్నితమైన కడుపుకు అనుకూలమైన 7 ఆహారాల జాబితాను ఆయన పంచుకున్నారు. వాటిలో ఉండే ఫైబర్ పరిమాణాన్ని కూడా వివరించారు.

ప్రతిరోజు కడుపు ఉబ్బరం గురించి ఆందోళన చెందకుండా ఆహారంలో చేర్చుకోగల ఏడు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఈ...