భారతదేశం, ఆగస్టు 14 -- ఓలా ఎలక్ట్రిక్ తన రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించి ఒక కొత్త టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ కొత్త మోడళ్లను కంపెనీ వార్షిక కార్యక్రమం 'సంకల్ప్ 2025'లో అధికారికంగా ఆవిష్కరించనుంది. తమిళనాడులోని కృష్ణగిరిలో ఉన్న ఓలా గిగాఫ్యాక్టరీలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా కంపెనీ తన భవిష్యత్ ప్రణాళికలు, కొత్త ఉత్పత్తులు, సాంకేతికతలను ప్రకటించనుంది. అంతేకాకుండా, ఎలక్ట్రిక్ టూ-వీలర్ల కోసం తీసుకొస్తున్న సరికొత్త MoveOS 6 సాఫ్ట్‌వేర్‌ను కూడా ఈ వేదికపై ప్రదర్శించనుంది.
ప్రస్తుతానికి కొత్త ఓలా స్కూటర్ల గురించి పెద్దగా వివరాలు తెలియకపోయినా, అవి ఇప్పటికే ఉన్న మోడళ్లకు కొనసాగింపు కాకుండా, పూర్తిగా కొత్త ప్రాడక్ట్స్గా రానున్నాయని భావిస్తున్నారు. టీజర్ వీడియోలో కొత్త మోడళ్ల డిజైన్లను కొంతసేపు చూపించారు. వీటిలో ఒ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.