భారతదేశం, ఆగస్టు 14 -- ఓలా ఎలక్ట్రిక్ తన రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించి ఒక కొత్త టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ కొత్త మోడళ్లను కంపెనీ వార్షిక కార్యక్రమం 'సంకల్ప్ 2025'లో అధికారికంగా ఆవిష్కరించనుంది. తమిళనాడులోని కృష్ణగిరిలో ఉన్న ఓలా గిగాఫ్యాక్టరీలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా కంపెనీ తన భవిష్యత్ ప్రణాళికలు, కొత్త ఉత్పత్తులు, సాంకేతికతలను ప్రకటించనుంది. అంతేకాకుండా, ఎలక్ట్రిక్ టూ-వీలర్‌ల కోసం తీసుకొస్తున్న సరికొత్త MoveOS 6 సాఫ్ట్‌వేర్‌ను కూడా ఈ వేదికపై ప్రదర్శించనుంది.

ప్రస్తుతానికి కొత్త ఓలా స్కూటర్ల గురించి పెద్దగా వివరాలు తెలియకపోయినా, అవి ఇప్పటికే ఉన్న మోడళ్లకు కొనసాగింపు కాకుండా, పూర్తిగా కొత్త ప్రాడక్ట్స్​గా రానున్నాయని భావిస్తున్నారు. టీజర్ వీడియోలో కొత్త మోడళ్ల డిజైన్లను కొంతసేపు చూపించారు. వీటిలో ఒ...