భారతదేశం, నవంబర్ 11 -- ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ నుంచి ఓ అతిపెద్ది రివీల్ ఈ వీకెండ్ ఉండబోతోంది. దీనికోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 100 అడుగుల భారీ ఎల్‌ఈడీ స్క్రీన్ కూడా రెడీ చేశారు. అంతేకాదు ఈ ఈవెంట్ ను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియోహాట్‌స్టార్ వెల్లడించింది.

రాజమౌళి, మహేష్ బాబు మూవీ నుంచి రాబోతున్న ఆ బిగ్గెస్ట్ రివీల్ ఏంటన్న ఉత్కంఠ అభిమానుల్లో పెరిగిపోతుంది. మరో నాలుగు రోజుల్లో అదేంటో తేలనుంది. ఇప్పటికే సోమవారం (నవంబర్ 10) అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ సంచారి అనే సాంగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ రివీల్ ఈవెంట్ ను జియోహాట్‌స్టార్ లైవ్ స్ట్రీమింగ్ చేయబోతోంది. ఆ విషయాన్ని ఈ ఓటీటీ మంగళవారం (నవంబర్ 11) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"లెజెండ్స్ ఒక్కటైనప్పుడు చరిత్ర సృష్టించబడుతుంది. మహేష్ బాబు, ప్రి...