భారతదేశం, జూలై 23 -- ఓటీటీలో థ్రిల్లర్ మూవీస్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ థ్రిల్లర్ సినిమా, వెబ్ సిరీస్ ఓటీటీని ఊపేస్తున్నాయి. జియోహాట్‌స్టార్‌ లో ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. ఆ సినిమా 'డీఎన్ఏ' అయితే, ఆ సిరీస్ ఏమో 'స్పెషల్ ఓపీఎస్ 2'. ఈ రెండు కూడా జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి. ట్రెండింగ్ లో అదరగొడుతున్నాయి.

థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన క్రైమ్ థ్రిల్లర్ డీఎన్ఏ ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. తెలుగులో థియేటర్లలో మై బేబీ టైటిల్ తో జులై 18న రిలీజ్ అయింది. ఆ తర్వాతి రోజు అంటే జులై 19న ఓటీటీలోకి వచ్చేసింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ జియోహాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో అధర్వ మురళి, నిమిషా సజయన్‌ హీరో హీరోయిన్లుగా నటించారు.

పుట్టగానే మారిపోయిన తమ బిడ్డ కోసం కోసం వెతికే ...