భారతదేశం, ఫిబ్రవరి 19 -- మెగాస్టార్ చిరంజీవి దూకుడు మామూలుగా లేదు. మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లలో రూ.380 కోట్లకుపైగా వసూళ్లతో సంచలనం సృష్టించగా.. ఇప్పుడు ఓటీటీలోనూ 500 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ ఘనత సాధించిన తెలుగు మూవీ ఇదే.

అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు జీ5 ఓటీటీలో 500 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "మెగా 500 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్.. ది మెగా విక్టోరియస్ బ్లాక్‌బస్టర్ అన్‌స్టాపబుల్. మన శంకరవరప్రసాద్ గారు ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

ఇదే ప్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆర్ఆర్ఆర్ కూడా ఈ మార్క్ అందుకుంది. ఈ రెండు తెలుగు సినిమాలు కాకుండా అజ...