Hyderabad, మే 11 -- ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో దిగ్గజ సంస్థగా వెలుగొందుతోంది నెట్‌ఫ్లిక్స్. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంతగానే అలరిస్తున్న నెట్‌ఫ్లిక్స్ అందరి ఆదరణ పొందుతోంది. ఇక ఎప్పటిలాగే నేటి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల జాబితా వచ్చేసింది. మరి ఆ సినిమాల్లో చూడాల్సిన ది బెస్ట్ ఐదు సినిమాలపై లుక్కేద్దాం.

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. సుమారు రూ. 270 నుంచి 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్‌గా రూ. 246 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక తమిళంలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టిన చిత్రంగా పేరు తెచ్చుకుంది.

ఇలాంటి గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో మే 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. గుడ్ బ్యాడ్ అగ...