భారతదేశం, డిసెంబర్ 23 -- 2025 ముగింపు దశకు వచ్చింది. ఈ ఏడాది టాలీవుడ్‌లో దాదాపు 250 సినిమాలు విడుదలయ్యాయి. భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా, అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించిన 'స్లీపర్ హిట్స్' కూడా చాలానే ఉన్నాయి. 'రాజు వెడ్స్ రాంబాయి' నుంచి 'మ్యాడ్ స్క్వేర్' వరకు.. ఈ ఏడాది ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన టాప్ 7 సినిమాలు, వాటి ఓటీటీ వివరాలు ఇవే.

అసలు ఇలాంటి ఒక సినిమా వచ్చిందనే విషయం కూడా మొదట్లో చాలా మందికి తెలియదు. కానీ విడుదలయ్యాక బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 15 కోట్లు వసూలు చేసింది. యధార్థ సంఘటనల ఆధారంగా సాయిలు కంపటి తెరకెక్కించిన ఈ చిత్రంలో విలన్‌గా చేసిన చైతు జొన్నలగడ్డ నటన హైలైట్‌గా నిలిచింది. ఈ మూవీని ఈటీవీ విన్ ఓటీటీలో చూడొచ్చు.

నేచురల్ స్టార్ నా...