భారతదేశం, ఫిబ్రవరి 13 -- మలయాళంలాంటి ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగులో ప్రయోగాలు చాలా తక్కువనే చెప్పాలి. వచ్చే కొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కనిపించకుండానే వెళ్లిపోతాయి. అలాంటిదే ఓ మూవీ శ్రీ చిదంబరం గారు. ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఫిబ్రవరి 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 8.5 రేటింగ్ నమోదైంది.

కొత్త నటీనటులతో తెరకెక్కిన ఎమోషనల్ రూరల్ డ్రామా శ్రీ చిదంబరం గారు. ఈ సినిమాను వచ్చే గురువారం అంటే ఫిబ్రవరి 19 నుంచి ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. "మనసులను కదలించిన స్టోరీ.. ఓ బ్లాక్‌బస్టర్ సెన్సేషన్ అయింది. శ్రీ చిదంబరం గారు ఎ విన్ డిజిటల్ ప్రీమియర్ ఫిబ్రవరి 19న కేవలం ఈటీవీ విన్‌లో" అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ఆ ఓటీటీ వెల్లడించింది.

'శ్రీ చిదంబరం గారు' సినిమాకు వినయ్ రత్నం...