భారతదేశం, డిసెంబర్ 24 -- ఇండియా గర్వించదగ్గ చంద్రయాన్ ప్రయోగాలు ఇప్పుడు వెబ్ సిరీస్ రూపంలో రాబోతున్నాయి. ది వైరల్ ఫీవర్ (TVF) నిర్మాణంలో 'స్పేస్ జెన్ - చంద్రయాన్' (Space Gen - Chandrayaan) అనే సిరీస్ త్వరలో జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇస్రో శాస్త్రవేత్తల కృషి, చంద్రయాన్ 1, 2, 3 మిషన్ల వెనుక ఉన్న అలుపెరగని పోరాటాన్ని ఇందులో చూపించనున్నారు.

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) చంద్రునిపై జరిపిన అద్భుత ప్రయోగాల చరిత్రను కళ్లకు కట్టేందుకు జియోహాట్‌స్టార్ సిద్ధమైంది. ప్రముఖ కంటెంట్ క్రియేటర్స్ టీవీఎఫ్ (The Viral Fever) ఈ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఇది చంద్రయాన్ మిషన్ పై తెరవెనుక జరిగిన తతంగాన్ని కళ్లకు కట్టనుంది.

ఈ సిరీస్ గురించి అనౌన్స్ చేస్తూ.. మేకర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "కలలు కనేవారి కోసం.. వాటిని న...