Hyderabad, జూన్ 16 -- సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సిరీస్‌లో ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజీ గురించి తెలియని మూవీ లవర్స్ ఉండరు. వెంట్రుక వాసు తప్పుతో ఎంతో మంది మరణిస్తుంటారు. నిర్లక్ష్యంతో చేసే ఒక చిన్న తప్పు ఎందరో ప్రాణాలను బలిగొంటుంది. ఆ ప్రమాదాల నుంచి బయటపడిన వాళ్లను కూడా మృత్యువు వెంటాడుతుంది.

ఊహిస్తేనే ఎంతో భయంకరంగా ఉండే ఈ కాన్సెప్టుతో సినిమాలను తెరకెక్కించి సూపర్ హిట్ ఫ్రాంచైజీగా పేరు తెచ్చుకుంది ఫైనల్ డెస్టినేషన్. ఈ మూవీ సిరీస్‌లో ఇప్పటికీ ఐదు సినిమాలు వచ్చాయి. అన్ని మంచి సక్సెస్ సాధించాయి. రీసెంట్‌గా గత నెలలో ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజీ నుంచి ఆరో మూవీ వచ్చింది.

ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా 2025 మే 16న వరల్డ్ వైడ్‌గా విడుదలైతే ఇండియాలో ఒకరోజు ముందే మే 15న థియేటర్లలో రిలీజ్ అయింది. అది కూడా తెలుగు భాషలో ప్...