Hyderabad, సెప్టెంబర్ 19 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో జోనర్ ఎలాంటిదైన కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తుంటారు. అయితే, మినిమమ్ గ్యారెంటీ ఉన్న జోనర్లలో హారర్ థ్రిల్లర్స్ ఒకటి. ఈ జోనర్ టైప్ సినిమాలను చూసేందుకు ఓటీటీ ఆడియెన్స్ కాస్తా ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.

అందుకే, ఎప్పుడు ఎలాంటి హారర్ సినిమాలు వచ్చిన వాటిపై ఓటీటీ లవర్స్ ఫోకస్ ఉంటుంది. అయితే, ఈ వారం కూడా ఓ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా నిన్నటి (సెప్టెంబర్ 18) నుంచే ఆ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీనే సిన్నర్స్. అదిరిపోయే ట్విస్టులతో సాగే సిన్నర్స్‌లో హారర్ మాత్రమే కాకుండా మల్టీపుల్ లేయర్స్ ఉన్నాయి.

భయపెట్టే హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన సిన్నర్స్‌లో శృంగారం వంటి బోల్డ్ సీన్స్ సైతం...