భారతదేశం, ఫిబ్రవరి 18 -- సజిన్ బాబు దర్శకత్వంలో రీమా కల్లింగల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ మూవీ 'థియేటర్: ది మిత్ ఆఫ్ రియాలిటీ' (Theatre: The Myth of Reality) ఎట్టకేలకు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా ఫిబ్రవరి 21 నుంచి మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

గతేడాది అక్టోబర్‌లో థియేటర్లలో ఈ థియేటర్: ది మిత్ ఆఫ్ రియాలిటీ విడుదలైనప్పటికీ.. పరిమిత స్క్రీనింగ్ వల్ల చాలా మంది ఈ సినిమాను చూడలేకపోయారు. అనేక చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ఇప్పుడు మనోరమ మ్యాక్స్ స్ట్రీమింగ్ చేయబోతోంది. అయితే ఇది కేవలం మలయాళం ఆడియోతోనే వస్తుంది. ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ తో ఎవరైనా చూడొచ్చు. ఫిబ్రవరి 21 నుంచి స్ట్రీమింగ్ మొదలవుతుంది.

ఒక న...