భారతదేశం, డిసెంబర్ 26 -- మలయాళంలో సూపర్ హిట్ అయిన 'కిష్కింధ కాండం' మూవీ టీమ్ నుంచి వచ్చిన మరో ఆసక్తికర మిస్టరీ థ్రిల్లర్ 'ఎకో' (Eko). థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. డిసెంబర్ 31న నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సహా 5 భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

మలయాళ మిస్టరీ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి న్యూ ఇయర్ కానుక రెడీ అయ్యింది. దింజిత్ అయ్యతన్ దర్శకత్వంలో వచ్చిన 'ఎకో' సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే చూసేయొచ్చు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా అధికారికంగా ప్రకటించింది.

వచ్చే బుధవారం అంటే డిసెంబర్ 31 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టనుంది. అంతేకాదు మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది. దీంతో ఓటీటీలో ఈ సినిమాకు మరింత మంచి రెస్పాన్స్ వచ...