భారతదేశం, మే 21 -- తెలుగు టెక్నో థ్రిల్ల‌ర్ మూవీ వైర‌ల్ ప్ర‌పంచం థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. మే 23 నుంచి స‌న్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను స‌న్ నెక్స్ట్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఓ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

వైర‌ల్ ప్ర‌పంచం మూవీలో సాయి రోన‌క్‌, నిత్యా శెట్టి, ప్రియాంక శ‌ర్మ‌, స‌న్నీ న‌వీన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బ్రిజేష్ తండి ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

మార్చి ఫ‌స్ట్ వీక్‌లో వైర‌ల్ ప్ర‌పంచం మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ మూవీ ర‌న్ టైమ్ కేవ‌లం 97 నిమిషాలే కావ‌డం గ‌మ‌నార్హం. కంప్యూట‌ర్స్ స్క్రీన్స్ ఆధారంగానే ఈ సినిమా మొత్తం సాగుతుంది. హీరోహీరోయిన్ల వీడియో కాల్స్ మాట్లాడుకోవ‌డం చుట్టూనే క‌థ‌ను న‌డిపించారు ద‌ర్శ‌కుడు. ప్ర‌యోగాత్మ‌కం...